బంగ్లాదేశ్ కకావికలు.. మరో వికెట్ డౌన్

బంగ్లాదేశ్ కకావికలు.. మరో వికెట్ డౌన్



కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరుగుతున్నారు. లంచ్ సమయానికి 73/6తో ఉన్న బంగ్లాదేశ్, 82 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో ఇబాదత్ హొసైన్ బౌల్డయ్యాడు. ప్రస్తుత 26 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్ తీసుకున్నాడు.