సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ పంపిణీ

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కంపెనీ యాజమాన్యం దీపావళి బోనస్ పంపిణీ చేసింది. కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.64,700 చొప్పున బోనస్ ఇచ్చింది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీపావళి బోనస్ కింద సింగరేణి యాజమాన్యం రూ.258 కోట్లు విడుదల చేసింది. ఇటీవలే రూ.494 కోట్ల లాభాలను బోనస్‌గా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కార్మికులకు బోనస్‌గా సగటున రూ. లక్షకు పైగా నగదు అందుతుందని యాజమాన్యం తెలిపింది. బోనస్ డబ్బుల్లో కొంత మొత్తం ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని సూచించింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.